ప్రజాశక్తి- గాజువాక: ఈనెల 30న, సోమవారం పెదగంట్యాడ గొడ్డువానిపాలెం కల్చర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని మహిళలు, వికలాంగులకు ప్రత్యేకంగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షులు పేర్ల అప్పారావు తెలిపారు. గురువారం విశాఖపట్నం దివ్యకళామేళాలో దీనికి సంబంధించిన కరపత్రాలను వికలాంగుల సంక్షేమశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సుబ్బిరెడ్డి ఆవిష్కరించారు.ఈసందర్భంగా అప్పారావు మాట్లాడుతూ, ఈ జాబ్‌మేళాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని 18- 35 ఏళ్ల వయసు కలిగి, కనీసం 10వ తరగతి పూర్తిచేసిన వికలాంగులు, అలాగే 18 – 28ఏళ్ల సంవత్సరాలు మహిళలు ప్రత్యక్షంగా జాబ్‌మేళాలో హాజరు కావచ్చునని తెలిపారు. కరపరతాల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ వికలాంగుల ఐటిఐ ప్రిన్సిపాల్ భాస్కరరావు, ఎయు ప్రొఫెసర్, కల్చర్ ఫౌండేషన్ ట్రైనర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
