జాబ్‌ మేళాలో 42 మందికి ఉద్యోగాలు

Sep 30,2024 23:57

ప్రజాశక్తి-దర్శి: దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన జాబ్‌ మేళాలో 116 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏవీ కవిత తెలిపారు. ఈ మేళాలో అరబిందో ఫార్మాకు 9 మంది, డి.మార్ట్‌కు 23 మంది, మాస్టర్‌ మైండ్స్‌కు 10 మంది ఉద్యోగాలకు సెలెక్ట్‌ అయినట్లు చెప్పారు. మొత్తంగా ఈ జాబ్‌ మేళాలో 42 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించినట్లు ప్రిన్సిపాల్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్‌ వెంకటగణేష్‌ (అరబిందో ఫార్మా), డి ఉజ్వల (డి.మార్ట్‌), వై పోలయ్య (మాస్టర్‌ మైండ్స్‌) హెచ్‌ఆర్‌లు పాల్గొని ఆయా సంస్థల వివరాలను ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఏ నగేష్‌, స్కిల్‌ హబ్‌ కో-ఆర్డినేటర్‌ ఎస్‌ రమేష్‌, స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్‌ కో-ఆర్డినేటర్‌ ఈ జాబ్‌ మేళాను సమన్వయం చేశారు. కళాశాల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఈ జాబ్‌ మేళాలో 13 మందికి ఇంటర్న్‌షిప్‌ కూడా కల్పిస్తున్నట్లు తెలియజేశారు.

➡️