టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-పామూరు: పామూరు పట్టణానికి చెందిన కాపు సంఘ నాయకులు వరికూటి చిరంజీవి వరికూటి హనుమంతు వారితో పాటు నలభై కుటుంబాలు కనిగిరి ఇన్‌ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. బుధవారం పామూరు పట్టణానికి చెందిన బోయల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన మిత్రవర్గం, స్నేహితులు, 40 కుటుంబాలు కనిగిరిలో ఉగ్ర క్యాంప్‌ కార్యాలయం వెళ్లి ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా తవలు వేసికొని పార్టీలో చేరినట్లు చిరంజీవి తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ ఉగ్ర గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని ఉగ్రకు హామీ ఇచ్చారు. ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ తాను మర్చిపోనని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వెంకటస్వామి, రాంబాబు, శ్రీను మరికొందరు ఉన్నారు.

➡️