ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : గుడ్లవల్లేరు మండలంలోని కవుతరం, అంగలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులోని ఆర్.ఎస్.కె కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కవుతరం కొనుగోలు కేంద్రం నుండి వాహనాలపై గుడివాడ కు ధాన్యాన్ని తరలించగా అక్కడ దిగుమతి చాలా వ్యవధి పడుతుందని జాయింట్ కలెక్టర్ కు తెలిపారు. వ్యవధి పట్టకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంత రైతులకు తగు, సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ డీ లోకరాజు, మండల వ్యవసాయ అధికారి లోయ సునీల్ , సీఈవో భరత్ కుమార్, వీఆర్వో మల్లికార్జున రావు, సహకార బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.