ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంజుల అనే లబ్ధిదారురాలికి వితంతు పెన్షన్ కింద 4,000 రూపాయలు మరియు దినేష్ అనే లబ్ధిదారుడికి దివ్యాంగుల పెన్షన్ కింద 6,000 రూపాయలు, ఇతర పెన్షన్లు జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసిన పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఆఫీసర్ విజరు కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
