ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ బుధవారం పర్యటించారు. ఆనందపురం సర్వే నెంబర్ 276లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 2.40 సెంట్లు, జిల్లా సైనిక్ పోర్టుకు 50 సెంట్లు, ఎక్సేంజ్ కార్యాలయానికి 40 సెంట్లు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన స్థలాలకు వెంటనే సరిహద్దులు వేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కళాశాల స్థలంలో ఉన్న అక్రమార్కులను వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. గండిగుండం, శొంఠ్యాం ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములు పరిశీలనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకటికి రెండుసార్లు తనిఖీలు నిర్వహించాలని బృందానికి ఆదేశించారు. నేరుగా కొంతమంది రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్, తహశీల్దార్ పేర్లి శ్యాం ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ రాజేష్, సర్వే డీటీ శ్రీనివాస రావు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
