లేబర్‌ చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష : జడ్జి

ప్రజాశక్తి – కడప బాండెడ్‌ లేబర్‌ సిస్టం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్షతోపాటు జరిమానా వేయడం జరుగుతుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో బాండెడ్‌ లేబర్‌ నిర్మూలన దినం పురస్కరించుకొని వర్క్‌షాప్‌, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన బాండెడ్‌ లేబర్‌ నిర్మూలన దినం నిర్వహిస్తామని తెలిపారు. బాండెడ్‌ లేబర్‌ యాక్ట్‌ 1976లో భారతదేశంలో బాండెడ్‌ లేబర్‌ సిస్టంను రద్దు చేయడానికి ”ది బాండెడ్‌ లేబర్‌ సిస్టం (అబోలిషన్‌) యాక్ట్‌, 1976” అనే చట్టం రూపొందించబడింది తెలిపారు. ఆర్టికల్‌ 23, సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఫర్‌ రిహబిలిటేషన్‌ ఆఫ్‌ బాండ్‌ లేబర్‌ 2021, బాండెడ్‌ లేబర్స్‌ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు బాండేడ్‌ లేబర్‌ సంబంధించిన పథకాలను ప్రజలలోకి తీసుకొని వెళ్లాలని సూచించారు. వెట్టిచాకిరి నిర్మూలన, నిర్భంద ఉచిత విద్య, బాండెడ్‌ లేబర్‌ సిస్టం చట్టం 1976 ప్రకారం అతిక్రమించిన వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తామని చెప్పారు. చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌1098, లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100, చైల్డ్‌ రైట్స్‌, ప్రాథమిక హక్కులు, విధులు మొదలగు అంశాలను వివరించారు. కార్యక్రమంలో కడప రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి.జాన్‌ ఎర్విన్‌, డిస్టిక్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి కరీం, డిస్టిక్‌ ప్రొబేషన్‌ అధికారి చెన్నారెడ్డి, డిస్టర్బ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి సుభాష్‌ యాదవ్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు, ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్లు, ఎన్‌జిఒలు పాల్గొన్నారు.

➡️