ప్రజాశక్తి -డోన్ (నంద్యాల) : విద్యార్థుల పరీక్షా సమయంలో ఒత్తిడికి గురికాకుండా పరీక్ష రాయాలని డోన్ జూనియర్ సివిల్ జడ్జి తంగమణి, సీఐ ఇంతియాజ్, ఎస్ ఐ శరత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన 2024-25 నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సరస్వతీ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి తంగమణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇంటి దగ్గర సెల్ ఫోన్ విరివిగా వాడడం వల్ల చదువు పై దృష్టి సారించలేక పోతున్నారని గుర్తుచేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని, మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. జీవితంలో అనేక ఒత్తిడులు వస్తాయని, వాటిని తట్టుకుని నిలబడినప్పుడే సాఫల్యం అవుతుందన్నారు. విద్యార్థిగా చదువు పైన దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్టు వారిగా తగు సూచనలు చేశారు. విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. జడ్జి తంగమణి , సిఐ ఇంతియాజ్ , ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివప్రసాద్, సుబ్బారెడ్డి, వెంకటరమణ, రవిశేఖర్, వెంకట లక్ష్మీ, రాధ, లక్ష్మయ్య,అనంత శ్రీనివాసులు, రఘునాథ్, ఎస్తేరమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, మద్దిలేటి, సుబ్బరాయుడు, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, సుభాన్, శ్రీనివాసులు, జయసుబ్బరాయుడు, శివన్న, బాబు, ఆదినారాయణ, సురేష్, లీలావతమ్మ, సంజీవరెడ్డి, రమేష్, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి, భారతి, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, శేష శయన శర్మ, మునిరాజు, ప్రసాద్ రావు, రవీంద్ర శర్మ,మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.
