ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : మహాత్మా జ్యోతిబా పూలే మహిళలకు మార్గ దర్శకులు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పట్నం రాజేశ్వరి అన్నారు. గురువారం కర్నూలు పట్టణం నందలి స్థానిక పూలే సర్కిల్ లో మహాత్మా జ్యోతిబా పూలే 134 వ వర్థంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పట్నం రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూలే సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి వచ్చిన కలెక్టరు ను మహిళా ఐక్య వేదిక అధ్యక్షులు పట్నం రాజేశ్వరి కలిసి విగ్రహ ఏర్పాటులో జరిగిన లోపాలను సరిచేసి తిరిగి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ల విగ్రహాలను ఏర్పాటు చేయాలని, సర్కిల్ డిజైన్ ను మార్చాలని జిల్లా కలెక్టరు రంజిత్ భాషను అడగడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి పూలే సర్కిల్ డిజైన్ ను మార్చే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మి , కొమ్ముపాలెం శ్రీనివాసులు, రాంబాబు, పాలెం రాధ, హుస్సేన్ బీ, దేవీబాయి, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.