ప్రజాశక్తి , పలమనేరు (చిత్తూరు) : పలమనేరు సిఐటియు ఆఫీస్ కెవిపిఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 199 జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నూరు ఈశ్వర్ అధ్యక్షత వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా, ఈశ్వర్ మాట్లాడుతూ మొట్టమొదట మహిళలని అంటరానితనానికి దూరం చేసిన వ్యక్తి అని కొనియాడారు. జ్యోతిరావు పూలే అతని భార్యని విద్యావంతురాలని చేసి వెనుకబడిన తరగతులకు చదువు చెప్పి జ్ఞానవంతులని చేయాలని పాటుబడిన వ్యక్తులలో జ్యోతిరావు పూలే మొట్టమొదటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన వ్యక్తి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి సామాజిక తరగతులకు అణిచివేతకు గురి కాకుండా ఆ కాలంలో పోరాటాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే అతని భార్య సావిత్రి భాయ్ పూలేకు మాత్రమే కాకుండా.. ప్రజలందరికీ విద్య దక్కాలని పాటుపడిన వ్యక్తి అని అన్నారు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించిన్నట్లు చెప్పారు. అదేవిధంగా వితంతువుల కోసం వసతిగృహాన్ని కూడా స్థాపించారన్నారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో పూలే దంపతులు ఉన్నారన్నారు. కావున పూలే దంపతుల ఆశయ సాధన కోసం కుల వివక్ష పోరాట సంఘం నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, జయంతి, ధనమ్మ, నందిని, లక్ష్మయ్య రత్నమ్మ, ప్రతాప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది
