జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శమని ఎఎస్‌పి కె. ప్రకాష్‌ బాబు కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి మాట్లాడుతూ పూలే సామాజిక తత్వవేత్తగా సమాజంలో అనేక విదా లుగా ప్రజలను చైతన్యం పరిచారని, ప్రజలలో అనాదికాలంగా పాతుకుపోయిన వివక్షలను నిర్ములించుటకు తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ యాలను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపనకు కషి చేయాలని కోరారు. ఎఆర్‌ అదనపు ఎస్‌పి బి.రమణయ్య, ఎఆర్‌ డిఎస్‌పి కె. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఆనంద్‌, టైటాస్‌, వీరేష్‌, శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్‌ఎస్‌ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు. వైవీయూలో.. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆధునిక సమాజ రూపకర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని యోగివేమన విశ్వవిద్యాలయ విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి ఉత్సవాలు యోగి వేమన విశ్వ విద్యాలయ పరిపాలన భవనంలో ఒబిసి సెల్‌ అధ్యక్షులు ఆచార్య కె.ఎస్‌.వి. కష్ణారావు అధ్యక్ష తన ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్‌ ఆచార్యులు ఎస్‌. రఘునాథ్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య పి.పద్మ, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్ర పటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో.. కడప : కాంగ్రెస్‌ పార్టీ ఒబిసి జిల్లా అధ్యక్షులు చిన్న కుళ్లాయప్ప ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు కడప అసెంబ్లీ సమన్వయకర్త బండి జకరయ్య, కడప నగర అధ్యక్షులు అఫ్జల్‌ ఖాన్‌, పిసిసి ప్రధాన కార్యదర్శి పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బండి సుమంత్‌ కుమార్‌, అబ్దుల్‌ సత్తార్‌, సయ్యద్‌ గౌస్‌ పీర్‌, పి.డి. సంజరు కాంత, రఫిఖ్‌ ఖాన్‌, మామిళ్ళ బాబు, మైనుద్దీన్‌, శ్యామలమ్మ, , గంగయ్య, ముబారక్‌ భాషా, కమల్‌ భాష, హరి ప్రసాద్‌, సిరాజుద్దీన్‌, సిద్ధిక్‌ పాల్గొన్నారు. వైసిపి ఆధ్వర్యంలో… మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధ నకు మనందరం కషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని మాజీ ఉప ముఖ్య మంత్రి అంజాద్‌బాషా, వైసిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌ రెడ్డి, నగరం సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వైసిపి జిల్లా బిసి సెల్‌ అధ్యక్షులు శివరామకష్ణ యాదవ్‌, నగర అధ్యక్షులు గంగరాజు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వైసిపి జిల్లా పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి, తర్వాత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో – ఆప్షన్‌ సభ్యులు, జిల్లా నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయ కులు, కార్యకర్తలు, బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో.. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా శాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే గొప్పతనాన్ని వివరించారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపడానికి, మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఆయన చేసిన కషిని కొనియాడారు.జ్యోతిబా ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన జీవితం, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, సమాజంలో సమానత్వం, న్యాయం కోసం కషి చేయాలి అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ అం కాల నాగరాజు, శివరామకష్ణ, రమేష్‌ యాదవ్‌, అధ్యాపకులు అనిత, సంపత్‌ కుమార్‌ రాజు, గోవర్ధన్‌, సుభాని, విద్యార్థులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితం ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని టిడిపి తొగటవీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్‌ అన్నారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులర్పించారు. జోన్‌ 5 ఇన్‌ఛార్జి ఎల్‌ఐసి నరసింహులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొన్నూరు రాంప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌, కడప నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్‌ పాల్గొన్నారు.బద్వేలు : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక పట్టణ నాయకులు కె. నాగేంద్రబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, పట్టణ నాయకులు నాగార్జున,బాబయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్ష -కార్యదర్శులు షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, షేక్‌ ఆదిల్‌ రజక వత్తిదారుల సంఘం పట్టణ నాయకులు చెప్పలి సుబ్బరాయుడు,వికలాంగుల హక్కుల సంఘం నాయకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖాజీపేట : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని టిడిపి నాయ కులు కొనియాడారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళులు అర్పిం చారు. మండల టిడిపి సీనియర్‌ నాయకులు సందుల నాగశివారెడ్డి, కెసి కెనాల్‌ డిస్ట్రిబ్యూటర్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇట్టెం శ్రీరా ముల యాదవ్‌, మైదుకూరు నియోజకవర్గం బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి తుట్టే రాము యాదవ్‌, లక్కు పుల్లారెడ్డి నివాళులర్పించారు. స్థానిక బస్టాండ్‌ కూడలిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గున్నం పాటి వెంకటరమణ పాల్గొన్నారు.వేంపల్లె : మహాహ్మా జ్యోతి రావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ కారుడని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో కాంగ్రెస్‌ నాయకులు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పులివెందుల నియోజ కవర్గం కాంగ్రెస్‌ సమన్వ యకర్త ధృవకుమార్‌రెడ్డి, వేంపల్లె, వేముల, పెండ్లిమర్రి, చక్రాయపేట మండల శాఖ అధ్య క్షులు రామకృష్ణ, వెంకటేష్‌, రామాంజనేయ రెడ్డి, మహ బూబ్‌ బాషా, డాక్టర్‌ సుబ్రమణ్యం, అమ ర్నాద ¸్‌రెడ్డి, ఉత్తన్న, బద్రి, నాగరాజు, లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. ముద్దనూరు : స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షులు నడమల శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గోపాలకృష్ణయ్య, చెన్నకేశవ రెడ్డి, బాలయ్య, సూర్యముని రెడ్డి, ప్రతాప్‌, కిరణ్‌ రెడ్డి, వెంకట్‌ ఆర్ట్స్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రొద్దుటూరు : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న పూలే విగ్రహానికి విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జగన్‌, ఏపీ ఎమ్మార్పీఎస్‌ కడప ఇన్‌ఛార్జి గడ్డం నర సింహ, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్‌ యూత్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ కత్తి ఓబులేసు మాట్లాడారు. బయన్న, దాసు, శ్రావణ్‌ పాల్గొన్నారు.

➡️