ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఈ నెల 14 నుండి 16 వరకు కడప జిల్లా పులివెందులలో జరగబోయే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ చాంపియన్షిప్ పోటీలలో పాల్గొనుటకు గురువారం విజయనగరం జిల్లా బాలబాలికల జట్లు బయలుదేరి వెళుతున్నాయి. రాష్ట్ర పోటీలకు వెళుతున్న జట్టులు రాష్ట్ర విజేతగా విజయం సాధించాలని, జిల్లా కబడ్డి సంఘ చైర్మన్ ఐ వి పి రాజు, కార్యదర్శి కె వి ప్రభావతి, అధ్యక్షులు రంగారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్ రావు లు ఆశీర్వదించారు.
