ప్రజాశక్తి-కడప అర్బన్ : నగరంలో పారిశుధ్య పనులు, సంక్రాంతి పండుగ సందర్భంగా … ప్రజలకు సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలను మంగళవారం ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ తో కలిసి 23వ డివిజన్ నాగరాజు పేటలో డివిజన్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ లోపల ప్రాంతాల్లో శానిటరీ కార్యక్రమాలు జరుగుతున్న తీరు, రోడ్ ఎన్క్రోచమెంట్, ప్రజలకు పెన్షన్లు అందుతున్న తీరు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్, రవితేజ, బాల, వెంకటసుబ్బయ్య, రమణ, అనిల్, అశోక్, షబ్బీర, శిరీష, లీలా పాల్గొన్నారు.
