ప్రజాశక్తి – వీరపునాయునిపల్లె (వేంపల్లె) వీరపునాయునిపల్లె మండలం నేలతిమ్మయ్యగారిపల్లె సమీ పంలో కూలీల ఆటోను ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన ముకుంద బస్సు ఢ కొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వీరయ్య(65) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కూలీల వివరాల మేరకు.. వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్న శ్రీనివాసులు, అంజనమ్మ, లక్ష్మయ్య, వీరయ్య, రమణమ్మ, చెండ్రాయుడు అనే కూలీలు అదే ప్రాంతానికి చెందిన ఆంజనేయులు ఆటోలో బెల్దారి పనుల కోసం శనివారం ఎర్రగుంట్లకు బయల్దేరారు. ఆటో నేలతిమ్మయ్యగారిపల్లె గ్రామ సమీపంలోని మలుపు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వేంపల్లెకు వస్తున్న ముకుంద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢకొీంది. ఆటో బోల్తా పడడంతో కూలీలందరూ రోడ్డుపై పడిపోయారు. రక్త గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో వేంపల్లె ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వీరయ్య అనే కూలీ పరిస్థితి విషమం కావడంతో వారిని కడపకు తరలిస్తుండగా మార్గ మధ్యలో వీరయ్య మృతి చెందాడు. వీరయ్య మృతదేహాన్ని వేంపల్లె ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ కాలనీలో విషాదఛాయలు అలుము కున్నాయి. విషయం తెలిసిన వెంటనే గాయపడిన వారిని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆర్‌వి రమేష్, టిడిపి నేతలు వేమా కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా ఆసుపత్రికి వెళ్లి పరా మర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను రామమునిరెడ్డి కోరారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
