‘పది’ మూల్యాంకనం ప్రారంభం

– తనిఖీ చేసిన పరిశీలకులు
ప్రజాశక్తి – కడప అర్బన్‌
స్పాట్‌ వేల్యూ షన్‌లో అలసత్వం తగదని, జవాబు పత్రాన్ని క్షు ణ్ణంగా పరిశీలించి మార్కులు వే యాలని, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని మూ ల్యాంకనం చేయాలని పదవ తరగతి పరీక్షల అబ్జ ర్వర్‌ మార్తాలా వెంకట కష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్‌ లో ప్రారంభమైన స్పాట్‌ వాల్యూషన్‌ కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మారెడ్డి అనురాధతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాకు కేటాయించిన పరీక్ష పత్రాలను రోజూ సబ్జెక్టు వారిగా మార్కులు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటిం చాలని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్‌ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️