ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిసలు

ప్రజాశక్తి – కడప
రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన అన్నీ పార్టీలూ బిజెపికి బానిసలుగా మారాయని కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంటు నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌ ఎం సుధాకర్‌ బాబు ఘాటుగా విమర్శించారు. సోమవారం కడపకు వచ్చిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ టిడిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ పార్టీ తక్షణ కర్తవ్యం అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులను, బూతు లెవెల్‌ కార్యకర్తలను సమన్వయపరుస్తూ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి పార్టీల వల్ల రాష్ట్రానికి గాని ప్రజలకు గాని ఏ మేలు జరగలేదన్నారు. పిసిసి మీడియా చైర్మన్‌ తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని కోరారు. అరకు లోయ ఒకప్పుడు కాఫీకి ప్రసిద్ధి అని, ప్రస్తుతం గంజాయి సాగుతో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.డి విజయ జ్యోతి, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వీనర్‌ సుబ్రహ్మణ్యం శర్మ, రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, రామాంజనేయులు, పీర్ల రషీద్‌, శ్రీకాంత్‌, శివ, చిన్నపరెడ్డి ,అచ్యుత రాజు? వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.( ఫోటో :- మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంట్‌ నియోజకవర్గం కోఆర్డినేటర్‌ ఎం. సుధాకర్‌ బాబు)

➡️