ప్రజాశక్తి – కడప
రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అం దించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని నగర కమిషనర్ ప్రవీణ్‌చంద్ పేర్కొన్నారు. మంగ ళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో త్వరలో జరగనున్న సాధారణ, ఎన్నికల సందర్భంగా ఎంసిఎంసి,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల్లో మీడియా పోషించాల్సిన పాత్ర పై ఎంసిఎంసి మెంబర్ గుర్రప్ప పవర్ పాయింట్ ప్రజెంటషన్ ద్వారా పాత్రికేయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి నగర కమిషనర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, ఎంసింసి మెంబర్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను చైతన్య పరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. వార్తా కథనాలు ప్రచురించే ముందు వాస్తవాన్ని తెలుసుకొని ప్రచురించాలని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ పి ఆర్ ఓ మస్తాన్, డివిజనల్ పిఆర్‌ఓ సునీల్ సాగర్, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సిబ్బంది, పాత్రికేయులు హాజరయ్యారు.
