సిడిపిఒ రమాదేవి
ప్రజాశక్తి – చింతకొమ్మాదిన్నె
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్ సిడిపిఒ రమాదేవి పేర్కొన్నారు. శనివారం మహిళా అభివద్ధి, శిశు స్ష్ఱంమ శాఖ పథక సంచాలకుల అదేశాల మేరకు శనివారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా సికె దిన్నె, చిన్న ముసలిరెడ్డిపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని చెప్పారు. వీటిని ప్రోత్సహించిన్నా, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని తెలియజేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం లీగల్ ఆఫీసర్ సునీత రాజు మాట్లాడుతూ పిల్లల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు, 1098 హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధి లోని సూపర్‌వైజర్లు శ్రీదేవి, వెంకట లక్ష్మి, బాలల పరిరక్షణ విభాగం ఔట్ రీచ్ వర్కర్ ప్రసన్న లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు.
