ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ
అమలుజిల్లా వ్యాప్తంగా 139 దుకాణాలు ఎంపిక
దరఖాస్తుల ఆహ్వానంలో ఎక్సైజ్ శాఖ
సిండికేట్‌కు నేతల యత్నాలు
ప్రజాశక్తి – కడప ప్రతినిధి
జిల్లాలో మద్యం టెండర్ల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం మంగళవారం రాత్రి నూతన మద్యం పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లా ఎక్సైజ్‌శాఖ దరఖాస్తుల ఆహ్వానానికి రంగం సిద్ధం చేసింది. జిల్లా రాజకీయ నాయకత్వం తమ అనుచరులకు మద్యం దుకాణాలు దక్కేలా చక్రం తిప్పే ప్రయత్నాల్లో నిమగమైంది. జిల్లాలోని మద్యం షాపులకు దాఖలు చేసే దరఖాస్తుదారులను సిండికేట్ చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఓ వినూత్న ప్రయోగాన్ని అమలు చేస్తోంది. మద్యం వ్యాపారంలో అనుభవం కలిగిన ఓ వ్యాపారిని ఎంపిక చేసుకుంది. ఈయన దరఖాస్తుదారులను సంప్రదించి ఒక్కో దుకాణానికి అధికార పార్టీకి చెందిన నలుగురు, ఐదుగురుతోనే దరఖాస్తులు దాఖలు చేయించే ప్రయత్నం చేస్తోంది. ఏఒక్కరికి లాటరీ దక్కినా తాను ఎంపిక చేయబడిన అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నాల్లో నేతలు నిమ్నగమైట్లు తెలుస్తోంది. జిల్లాలో నూతన మద్యం విధానం అమలు కానుంది. జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమలు ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 139 మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానించింది. కడప మండల పరిధిలో 30, సిద్ధవటం 8, ముద్దనూరు 7, ఎర్రగుంట్ల 14, ప్రొద్దుటూరు 14, జమ్మలమడుగు 19, పులివెందుల 16, మైదుకూరు 16, బద్వేల్ 15 చొప్పున మద్యం దుకాణాలు నిర్వహించడానికి కసరత్తు ముమ్మరం చేసింది. దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. దరఖాస్తుల దాఖలు చేయడానికి తొలిరోజు మంగళవారం కావడంతో దరఖాస్తులు దాఖలు చేయడానికి ఆశించిన రీతిలో మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు అమలు నేపథ్యంలో ఆన్‌లైన్‌లో కొన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్లపాటు నూతన పాలసీ అమలు నిబంధనల నేపథ్యంలో లైసెన్స్, టెండర్లలో పాల్గొనడానికి ఫీజుల చెల్లింపుల వ్యవహారం తదితర పనుల్లో నిమగమైనట్లు సమాచారం.సిండికేట్..కుతంత్రం..! నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో అధికార పార్టీ నాయకత్వం మద్యం దుకాణాలను దక్కించుకోవడంపై దృష్టి సారించింది. తొలిరోజు నుంచే ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు దరఖాస్తులు చేస్తున్నారనే అంశంపై దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను తమ అనుచరులకే దక్కేలా చేయడంపై అధికార పార్టీ నాయకత్వం కన్నేసింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఆశావహులు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కడప మండల పరిధిలోని 30 మద్యం దుకాణాలను దక్కించుకుకోవడం అధికార పార్టీ కన్నేసింది. కడప నగరంలో మద్యం వ్యాపారంలో అనుభవం కలిగిన ఓ అనుభవజ్ఞునికి సిండికేట్ బాధ్యతలు అప్పగించిందనే చర్చ ప్రచారంలో ఉంది. కడపలో ప్రీమియం స్టోర్?రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ స్టోర్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగి తెలిసిందే. కడప నగరంలోనూ ఒక ప్రీమియర్ స్టోర్ కలిగిన మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదనల్లో ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రీమియర్ స్టోర్ ఏర్పాటు సదుపాయానికి లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు ఫీజులు పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా 10 శాతంపైగా ఫీజులు పెంచనున్నట్లు తెలిపింది. ఈనెల ఒకటి నుంచి 11వ తేదీ వరకు దాఖలు చేసిన దరఖాస్తుదారులను సంప్రదించి సిండికేట్ చేసే బాధ్యతల్లో నిమగమైనట్లు తెలుస్తోంది. అనంతరం 12 నుంచి మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.బకాయిల భేరీ..!రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని 124 ప్రభుత్వ మద్యంషాపుల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి దుకాణానికి ముగ్గురు నంచి ఐదుగరు చొప్పున ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా ప్రయివేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడంపై ఆందోళన నెలకొంది. తాజాగా బద్వేల్ మండల పరిధిలోని మద్యం దుకాణాలకు చెందిన పలువురు ఉద్యోగులు ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలను పరిస్థితేమిటని నిలదీస్తోంది. బకాయని ఎవరు చెల్లిస్తారో చెప్పాలని ఆందోళనకు దిగింది. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి తరహా పరిస్థితి నెలకొంది.