చెట్టును ఢకొీన్న ప్రయివేట్‌ స్కూల్‌ బస్సు

– పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
ప్రజాశక్తి -కమలాపురం టౌన్‌ మండలానికి చెందిన ఓ ప్రయివేట్‌ స్కూల్‌ బస్సు చెట్టును ఢకొీంది. సంఘటనలో పలువురి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కమలాపురం పట్టణానికి చెందిన ఓ ప్రయివేట్‌ స్కూల్‌ బస్సు కొండాయ పల్లె వద్ద అదుపుతప్పి చెట్టును ఢకొీట్టింది. చుట్టుపక్కల గ్రామాల చెం దిన పలు విద్యార్థులకు గాయా లయ్యాయి. పోలీ సులు, స్థానికులు సకాలంలో స్పందించి గాయా లైన విద్యార్థులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. ఘటనలో మాచిరెడ్డిపల్లెకు చెందిన వెంకట హరీష, సురేంద్ర కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల యాజమాన్యం ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం చేస్తున్నారు. కాలం చెల్లిన బస్సు లను నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️