నీట్‌ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌
నీట్‌ పరీక్ష 2024 ఫలితాలు, నీట్‌ పరీక్ష నిర్వ హణపై విద్యార్థులు, తల్లిద ండ్రులు నుంచి అనేక అను మానాలు వ్యక్తమవు తున్న ందున నీట్‌ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వ హించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కడప పాత బస్టాండ్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున పారదర్శకత పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం ఉన్న ఒకే సీరియల్‌ నంబర్లతో కూడిన ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎన్‌టిఎ వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నగర ఉపాధ్యక్షులు విజరు పాల్గొన్నారు.

➡️