14న ‘నిరుద్యోగ వ్యతిరేక సదస్సు’

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళాగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈనెల 14న నిరుద్యోగ వ్యతిరేక సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ‘నిరుద్యోగ వ్యతిరేక సదస్సు’ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్‌ హాజరై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతీ, యువకుల సమస్యలను వివరిస్తారని తెలిపారు. దేశంలో లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థను ప్రతికటించాల్సిన అవసరం ఉందని, దేశ ప్రగతిని అడ్డుకుంటున్న నిరుద్యోగంపై పోరాడాల్సిన తక్షణ కర్తవ్యం నేటి యువత పైన ఉందని, దేశంలోని ఒక్క శాతం సంపన్నులకు దేశ ప్రజల శ్రమతో సష్టించబడిన సంపదలో 40 శాతం పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని విమర్శించారు. మోడీ 11 సంవత్సరాల పరిపాలనలో 200 మంది శతకోటేశ్వరులను సష్టించారని, రాష్ట్ర విభజన చట్టంలోని అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పిన ‘కడప ఉక్కు ఫ్యాక్టరీ’ ప్రభుత్వ రంగంలో నిర్మించడానికి ప్రయత్నం చేయలేదని ఎద్దేవ చేశారు. యుటిఎఫ్‌ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ప్రజా అనుకూల మేధావులు సిపిఎం నిర్వహిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్‌, బి.మనోహర్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి, కె.శ్రీనివాసులు రెడ్డి, సిపిఎం సీనియర్‌ నాయకులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ , డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చిన్ని, వి.శివకుమార్‌ పాల్గొన్నారు.

➡️