ప్రజాశక్తి-సింహాద్రిపురం : రైతులు విత్తనాలు నిలువపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి శివ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వై కొత్తపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం శనిగ పంట నూర్పిడి చేయడం జరుగుతుందన్నారు. అయితే రైతులు నూర్పిడి అనంతరం విత్తనాలలో అధిక తేమ శాతం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. నిల్వ ఉంచాలనే రైతులు వాటి పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో బుడ్డ సెనగ దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు ఏవో దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ఈ ఏడాది రబీ సీజన్లో తుఫాన్ ప్రభావంతో సెనగ దిగుబడి తగ్గిందని కావున ఇన్సూరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏవో వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది ప్రత్యూష శిరీష, దీపిక ,ఉష తదితరులు పాల్గొన్నారు.
