నిర్లక్ష్యంగా చేపట్టుతున్న పారిశుధ్య పనులు

Jan 8,2025 12:56 #Kadapa district

ప్రజాశక్తి – వేంపల్లె : వేంపల్లె గ్రామంలో పారిశుధ్య పనులను అధికారులు నిర్లక్ష్యంగా చేపట్టడంతో వీధులన్నీ చెత్త కుప్పలుగా మారిపోతున్నాయని వైసీపీ నేత పద్మా రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని గరుగువీధిలో అపరిశుభ్రతగా ఉన్న ప్రాంతాన్ని వైసీపీ నేత పద్మా రాజ్ కుమార్ పరిశీలించి పంచాయతీ అధికారులకు పిర్యాదు చేశారు. గరుగువీధిలో పారిశుధ్యం పనులు చేయక పోవడంతో రోడ్డు అంతా చెత్తతో నిండి పోయిందని తెలిపారు. కాలువల్లో చెత్తను కూడ తొలగించిక పోవడంతో కాలువలు కూడ చెత్తతో నిండి పోయాయని చెప్పారు. చెత్త డబ్బాను సిబ్బంది తొలగించారని కనీసం అ ప్రాంత ప్రజలు చెత్తను వేయడానికి చెత్త వాహనం కూడ అధికారులు పంపిచక పోవడం దారుణమని అన్నారు. చెత్త వాహనం గరుగువీధి ప్రాంతానికి వెళ్లక పోవడంతో చెత్తను ఇంట్లోలోనే రెండు, మూడు రోజులు పాటు పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లి వేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. అధికారులకు ప్రజల సమస్యలు పట్టవు కాని పన్నులు వసూలు చేయడానికి మాత్రం ముందు ఉంటారని చెప్పారు. పంచాయతీలో పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ పారిశుధ్యం మాత్రం మెరుగు పడడం లేదన్నారు. చెత్త ఎక్కడబడితే అక్కడ ఉండడంతో దోమలు వృద్ధి విపరీతంగా పెరిగి పోతున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న పారిశుధ్యం మాత్రం అధ్వానంగా తయారైందని వాపోయారు. ప్రజా ఆరోగ్యంపై చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గరుగువీధిలో చెత్తను, కాలువలను శుభ్రం చేయడంతో పాటు ప్రతి రోజూ చెత్త వాహనం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాగే పరిస్థితి నెలకొంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు.

➡️