హమీలను మరిచిన కూటమి ప్రభుత్వం

Feb 16,2025 11:59 #Kadapa district

ప్రజాశక్తి – వేంపల్లె : ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను మరిచిందని ఎంపిటిసి రహంతుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గాలికి వదిలి వేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల ముందు వాలంటీర్లకు 5 వేల నుంచి 10 వేలు చేస్తామని ఉచిత పలుకులను పవన్ కళ్యాణ్ పలకడం జరిగిందని చెప్పారు. మదనపల్లెలో మహిళాపై యాసిడ్ దాడి జరిగితే యాత్రలో ఉన్నానని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాలేదని చెప్పారు. విజయవాడలో మ్యూజికల్ కన్సర్ట్ కు మాత్రం యాత్ర మానుకోని డిప్యూటీ సిఎం రావడం శోచనీయం అన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అయోమయంగా మారిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క హామి కూడా నెరవేర్చలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నపుడు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని చెప్పారు. కర్నూలుకి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వ ప్రజా దృష్ట్యా పాలన చెయ్యాలని లేక పోతే వైసిపి ఉద్యమ బాట చెయ్యడం జరుగుతుందని చెప్పారు.

➡️