ప్రజాశక్తి – కడప
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌కు తెలియజేశారు. మంగళవారం రాజధాని అమరావతి నుంచి ఎస్‌ఎస్‌ఆర్ – 2025, రేష లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, ఓటర్ల సర్వే ప్రక్రియ వంటి అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కార్యక్రమానికి లెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరయ్యారు. సిఇఒ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2025 పురో గతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. విసి ముగిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హౌస్‌టు హౌస్ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్త యిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష ్కరించగా ఇంకా 4223 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్‌ఎస్‌ఆర్ -2025కి సంబంధించి అన్ని నియోజకవర్గాల వారీగా ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు , బిల్‌ఒలకు ఇదివరకే శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. స్వీప్ నోడల్ ఆఫీసర్‌గా నూతనంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నియమించామని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.