కార్పొరేషన్‌లో అవినీతి కంపు : టిడిపి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ : నగరపాలక సంస్థ 20 ఏళ్లపాటు పాటు అవినీతి కంపులో కూరుకుపోయిందని, ఆ ఇద్దరి వల్ల అభివద్ధి కుంటు పడిందని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ద్వారకా నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని వెలికి తీసి అభివద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాధవి కార్పొరేషన్‌ అభివద్ధి చేస్తుంటే కక్ష సాధింపు అంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నామని పేర్కొ న్నారు. వైసిపి అవినీతితో సర్వనాశనం చేశారని విమర్శించారు. వీరి అవినీతిని ప్రజల ముందు పెడతామని చెప్పారు. 90 శాతం మంది ప్రజలు సంతప్తి వ్యక్తం చేస్తే, 10 శాతం మంది గగ్గోలు పెడుతూ కక్ష సాధింపు అంటున్నారని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్‌ సుజల స్రవంతి పేరుతో రెండు రూపాయలకే మంచినీరు ప్రజలకు అందించాలని పథకం తీసుకొచ్చారని తెలిపారు. వైసిపి వచ్చాక మంచినీటిని వ్యాపారం చేశారని చెప్పారు. కార్పొ రేషన్‌ ఆస్తులు కాపాడాలని ఎమ్మెల్యే ఆర్‌టిసి సమావేశంలో కోరారని గుర్తు చేశారు. సమావేశంలో నగర ఉపాధ్యక్షులు మన్సూర్‌ అలీ ఖాన్‌, టిఎన్‌ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్‌ పాల్గొన్నారు.

➡️