ప్రజాశక్తి – కడప
జిల్లా నూతన ఎస్‌పి ఇ.జి. అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.డి. విజయ జ్యోతి నాయకత్వంలో కడప పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కడప ఎస్‌పి కార్యాలయంలో ఆయన్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ద్వారా ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు. ఎస్‌పిని కలిసిన వారిలో అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు బండి జకరయ్య, ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ బాష, అశోక్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సత్తార్, గౌస్ పీర్, సిరాజుద్దీన్, రఫీఖ్ ఖాన్, హరిప్రసాద్, ఇనామ్, శీలం గంగయ్య ఉన్నారు.
