బధిరుల క్రికెట్‌ టోర్నీ విజేత తెలంగాణ

ప్రజాశక్తి – కడప
కెఒఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన బధిరుల టి-20 క్రికెట్‌ టోర్న మెంటు ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుపై తెలం గాణ జట్టు విజయం సాధిం చింది. ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు బిల్లా రాజు నాయకత్వం వహిం చగా తెలంగాణ జట్టుకు జి. రాజారాం కెప్టెన్‌గా వ్యవహరించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో తెలంగాణ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు నిలిచింది. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రదీప్‌, బదురుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. దౌలత్‌ ఖాన్‌ విజేతగా నిలిచిన తెలంగాణ జట్టుకు, రన్నర్స్‌ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మన ఆరోగ్యాన్ని, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ని మెరుగుపరిచి రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలియజేశారు. మైదానం ఇచ్చి సహకరించిన జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్‌కు, సహాయ సహకారాలు అందించిన కడప నగర ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారికి, నగదు పురష్కార మందించిన శివ స్టూడియో అధినేత వేముల శివయ్యకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

➡️