సిపిఎం బహిరంగ సభకు జిల్లా నాయకులు

ప్రజాశక్తి – కడప అర్బన్‌
నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభల ముగింపు బహిరంగ సభకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు బయలుదేరి వెళ్లారు. పార్టీ సీనియర్‌ నాయకులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహిరంగ సభ విజయవంతం నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. పార్టీ నిర్ణయించిన లక్ష్యాల మేరకు ముందుకు వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, నారాయణరెడ్డి, చంద్రారెడ్డి, గోవిందు, రెబ్బ నరసింహులు పాల్గొన్నారు. గోపవరం మండలం నుంచి సిపిఎం బద్వేల్‌ పట్టణ కమిటీ సభ్యులు ఎం. చిన్ని, ఎస్‌. రాయప్ప, ఎం.వి.కుమార్‌, జి.అనంతమ్మ, ఎస్‌. కైరున్‌బీ, నాగబాబు, సి.సుబ్బారాయుడు, ఎస్‌.కె,. మస్తాన్‌,కె.శివ,పార్టీ శాఖ కార్యదర్శులు పి.కొండయ్య, మురాప్రసాద్‌ పార్టీ సభ్యులు కె. బాబయ్య, మస్తాన్‌ బీ, యు. బాలమ్మ, జి. సుబ్బరాయుడు, రామలక్ష్మమ్మ ఎస్‌. ఫాతిమా, బాలస్వామి,అధిల్‌ వెంకటపతి, వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసులు, బయలుదేరారు

➡️