డ్రగ్స్‌ నియంత్రణకు డివైఎఫ్‌ఐ కషి అభినందనీయం

ప్రజాశక్తి – బద్వేలు
డ్రగ్స్‌ నియంత్రణకు డివైఎఫ్‌ఐ కృషి అభినందనీయమని మున్సిపల్‌ కమిషనర్‌ వి.వి. నరసింహారెడ్డి పేర్కొన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ మాదక ద్రవ్యాల నివారణకై ముద్రించిన పోస్టర్స్‌ను బుధవారం డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నందు మున్సిపల్‌ కమిషనర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్వేల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ యువత మత్తు, మాదక ద్రవ్యాలు వంటి జోలికి వెళ్ళవద్దని, దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇప్పటికే జిల్లాలో గంజాయి మత్తుపదార్థాల వంటి వాటిని అరికట్టడానికి పోలీస్‌ యంత్రాంగం ఉక్కు పాదం మోపిందని చెప్పారు. మంచి మార్గంలో నడిచి మంచి భవిష్యత్‌ వైపు అడుగులు వేయాలని చెప్పారు. డ్రగ్స్‌ రహిత జిల్లాగా నిర్మిద్దామని యువత డ్రగ్స్‌ రహిత ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ నివారణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్‌ఐ యువజన సంఘానికి నాయకత్వానికి అభినందించారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ యువతను డ్రగ్స్‌ మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాల వైపు నుండి మంచి మార్గం వైపు నడపడం కోసం డివైఎఫ్‌ఐ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో డ్రగ్స్‌ గంజాయి వంటి వాటికి యువత అలవాటు పడి నిండు జీవితాన్ని భావితరాల యువత నాశనం చేసుకుంటున్నారు యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు అంటివి లభిస్తే ఇటువంటి వాటిపైకి ఆలోచన ఉండదన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ లాంటి ఒక భారీ పరిశ్రమ వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే ఈ ప్రాంతం అభివద్ధితోపాటు యువత చెడు వ్యసనాల వంటివి వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సి.సి ముద్దుకష్ణ డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, షేక్‌ ఆదిల్‌ బాషా, పట్టణ నాయకులు కె. రామకష్ణ, ప్రసాద్‌ రెడ్డి, రాజు, మనోహర్‌, మహమ్మద్‌ పాల్గొన్నారు.

➡️