ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో ఎస్‌సి రుణాల మంజూరుకు కసరత్తు ఊపందుకుంది. ప్రభుత్వం జిల్లాలోని ఎస్‌సి సామాజిక తరగతుల యువతకు రూ.34.40 కోట్లతో 828 యూనిట్లను ఖరారు చేసింది. ఎస్‌సి కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఎస్‌సి రుణాలను మంజూరు చేయడానికి సిద్ధమైంది. అర్హత కలిగిన యువత బ్యాంకు గ్యారెంటీలతోపాటు అధికార యంత్రాంగం ఇంటర్వ్యూలను అధిగమించాల్సి ఉంది. ఎంపికైన నిరుద్యోగ యువత ఎంపిక చేసుకున్న యూనిట్ల పరిశీలనకు జిల్లా అధికారులను బృందాలుగా ఏర్పరచి మానిటరింగ్ చేయనుంది. జిల్లాలో ఎస్‌సి నిరుద్యోగ యువతకు రూ.34.40 కోట్లతో 828 యూనిట్లతో స్వయం ఉపాధి కల్పనకు ఊతమివ్వనుంది. ఐఎస్‌బి సెక్టార్ టైప్-1, టైప్-2, టైప్-3, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ కింద 32 రకాల స్కీముల ద్వారా రుణాలను మంజూరు చేయనుంది. ఐఎస్‌బి సెక్టార్ టైప్-1 పరిధిలోని ఏడు స్కీములకు 151 మంది లబ్ధిదారులకు యూనిట్‌కు రూ. 2.50 లక్షల నుంచి రూ. 2.95 లక్షలు, ఐఎస్‌బి సెక్టార్ టైప్-2లో 19 స్కీముల్లో 421 మంది లబ్ధిదారులకు యూనిట్ రూ.3.10 లక్ష నుంచి రూ.ఐదు లక్షలు, ఐఎస్‌బి సెక్టార్ టైప్-3 పరిధిలోని ఇవి బ్యాటరింగ్ ఛార్జి యూనిట్‌కు రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేయనుంది. ట్రాన్స్‌పోర్టు సెక్టార్ పరిధిలోని టైప్-1 కింద 249 మంది లబ్ధిదారులకు ప్యాసింజర్ ఆటోకు రూ.మూడు నుంచి రూ.ఎనిమిది లక్షలు, టైప్-2 కింద వెహికల్ యూ నిట్‌కు రూ.10 లక్షల చొప్పున అందజేయనుంది. అగ్రికల్చరల్ విభాగం కింద డ్రోన్ నిర్వహణ నిమిత్తం ఏడుగురు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందజేయనుంది. సబ్సిడీ కథాకమీషుఎస్‌సి సామాజిక వర్గాలకు విడుదల చేసిన వివిధ రుణాలకు 60 శాతం నుంచి 40 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది. ఐఎస్‌బి సెక్టార్ టైప్-1 కింద 60 సబ్సిడీ, బ్యాంకులు 35 శాతం, లబ్ధిదారు ఐదు శాతం చొప్పున భరించాల్సి ఉంది. టైప్-2 కింద 40 శాతం సబ్సిడీ, బ్యాంకులు 55 శాతం, లబ్ధిదారు ఐదు శాతం చొప్పున వెచ్చించాల్సి ఉంది. టైప్-3 కింద 40 శాతం సబ్సిడీ, బ్యాంకులు 55 శాతం, లబ్ధిదారు ఐదు శాతం వెచ్చించాల్సి ఉంది. ట్రాన్స్‌పోర్టు సెక్టార్ పరిధిలోని టైప్-1 కింద 50 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. బ్యాంకులు 45 శాతం, లబ్ధిదారుడు ఐదు శాతం, టైప్-2 పరిధిలోని రుణాలకు 40 శాతం సబ్సిడీ, బ్యాంకులు 55 శా తం, లబ్ధిదారుడు ఐదు శాతం వెచ్చించాల్సి ఉంది. అగ్రికల్చర్ డ్రోన్ రుణాలకు 40 శాతం సబ్సిడీ, 55 శాతం బ్యాంకర్లు, ఐదు శాతం లబ్ధిదారులు వెచ్చించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు మంజూరు చేయడంతో ఎస్‌సి కార్పొరేషన్ చుట్టూ యువత తరుగుతోంది. స్వల్పసంఖ్యతో కూడిన ఎస్‌సి రుణాల వివరాలను ఎస్‌సి కార్పొరేషన్ అధికార యంత్రాంగం వెల్లడించడం ఉత్సుకతను నింపుతోంది. జిల్లాలోని ఎస్‌సి సామాజిక తరగతులకు చెందిన యువత ఆధార్, రేషన్, కులధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ వెబ్ సైట్‌ను ఆశ్రయించాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు స్వయం ఉపాధి యూనిట్లకు తిరిగి ఊపిరిపోయడంతో పెద్దఎత్తున యువత ఎదురు చూస్తోంది.