యప్రజాశక్తి – వేంపల్లె
మండలంలోని రామిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. శ్రీనువాసులు రెడ్డి (47) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి మతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు..గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు శ్రీనువాసులు రెడ్డికి 10 ఎకరాలు పొలం ఉంది. తన పొలంలో పత్తి, వేరుశనగ పంటలను సాగు చేశారు. అందుకోసం సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులు చేశారు. ప్రస్తుతం పత్తి పంట సాగు చేశారు. అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపం చెందడంతో పాటు జీవితం మీద విరక్తి చెంది ఆదివారం రాత్రి తన పొలంలోనే పంటల కోసం తెచ్చిన పురుగుల మందు తాగి ఇంటికొచ్చారు. పురుగుల మందు వాసన రావడంతో కుటుంబ సభ్యులు శ్రీనువాసులురెడ్డిని హుటాహుటినా పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అ్క్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. మతునికి భార్య శశికళతో పాటు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మతున్ని భార్య శశికళ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు.
