ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించాలి

ప్రజాశక్తి – కడప
ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించాలని వైసిపి నాయకులు డిమాండ్‌ చేశారు. వైసిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్‌ రెడ్డి పిలుపుమేరకు బుధవారం కడప నగరంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, నగర మేయర్‌ సురేష్‌ బాబు ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. వైసిపి కడప జిల్లా కార్యాలయం నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లు మీదుగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం డిఆర్‌ఒ విశ్వేశ్వర నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వైసిపి నాయకులు మాట్లాడారు.10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతకు సాక్ష్యంగా యువత పోరు నిలిచిందన్నారు. చంద్రబాబు నాయుడు పని ఇక అయిపోయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మోసాలు అధికమయ్యాయి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ ద్వారా వైఎ.స్‌ రాజశేఖర్‌ రెడ్డి విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇచ్చారు అన్నారు.అదే విధంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 90 శాతం మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్య దీవెన, వసతి దీవెన అందించారు అని తెలిపారు.5వ త్రైమాసికం జరుగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్‌ ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు అని ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలి అని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు డ.ిసి గోవింద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌ రామాంజనేయరెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవి రెడ్డి ఆదిత్య, జిల్లా విద్యార్థి విభాగమ అధ్యక్షుడు గురు సాయి దత్త, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️