ప్రజాశక్తి – వేంపల్లె : అడవి పందుల వలన పంట నష్టపోయిన రైతుకు ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం అందించారు. ఇటివల వేంపల్లె గ్రామంలోని రాజీవ్ కాలనీ సమీపంలోని కొండ ప్రాంతంలో సువర్ణ అనే మహిళ రైతు అరటి పంటను సాగు చేయడంతో అడవి పందులు స్వైర విహారం చేసి పంటను పూర్తిగా దున్నేయడం జరిగింది. దీంతో అటవీ అధికారులకు పిర్యాదు చేయడంతో బాధిత రైతుకు పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ నుండి బాధిత రైతు సువర్ణకు రూ 90.270 నష్ట పరిహరం మంజూరు కావడంతో అ చెక్కను రైతుకు ఫారెస్ట్ రెంజ్ అధికారి బాల సుబ్రమణ్యం అందజేశారు. అడవి జంతుల ద్వారా నష్ట పోయిన రైతుకు ఆదుకొనేందుకు ప్రభుత్వం నుండి పరిహరం మంజూరు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి బాల సుబ్రమణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి. వెంకట సుబ్బయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎస్. ఖాదర్ జీలాని, బీట్ ఆఫీసర్ డి. శివ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
