ప్రజాశక్తి – పులివెందుల టౌన్ పశుగ్రాసం కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈసారి వంటలు సరిగా పండకపోగా కొండ గుట్టల్లోనూ తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గ్రాసం కొరత పట్టిపీడిస్తోంది. దీనికి తోడు పశుగ్రాసం ధర కొండెక్కి కూర్చోవడంతో అంత ధర పెట్టి కొనలేక చాలా మంది పాడి రైతులు జీవాలను అమ్ముకుంటున్నారు. నియో జకవర్గంలో గ్రాసం కొరత తీవ్రమైంది. దీంతో పశుపోషకులు, జీవాల పెంపక దారులు వాటి పోషణకు ఆవస్థలు పడు తున్నారు. వ్యవసాయం కంటే అధికంగా రైతులు, కూలీలు సన్న జీవాలు (గొర్రెలు, మేకలు), పాడి పశువుల పెంపకం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అధిక ధరలకు గ్రాసం కొనలేక పలువురు పాడి రైతులు జీవాలను అమ్మేసు కుంటుండగా చాలా మంది అతికష్టంమీద పశుపోషణ చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 4390 పాడి రైతులు ఉన్నారు మండలాల వారీగా చూస్తే చక్రాయపేట 960, లింగాల 650, సింహాద్రిపురం 630, పులివెందుల 530, వేముల 520, తొండూరు 410, వేంపల్లి 660 మంది పాడి పై ఆధారపడి ఉన్నారు. గతంలో రైతులు పసుపు పోషణ కోసం వేరుశనగ , జొన్న, కొర్ర తదితర పంటలు సాగు చేసేవారు , కానీ ఈ పంటల సాగు చేయడానికి ఖర్చులు అధి కమవు తుండడంతో ఈ పంటలు వేయ డానికి రైతులు ఇష్టపడడం లేదు.ప్రతి ఏటా ఇదే దుస్థితి వేసవి రాగానే పొలం గట్లు, సమీప కొండగుట్టలు అగ్నికి ఆహుతి కావడం సర్వసాధరణ మైపోయింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎండు గడ్డిని కాల్చివేసే ఉద్దేశంతో పొలం గట్లకు నిప్పుపై ట్టేవారు కొందరైతే.. మరికొందరు పశువుల కాపరులు బీడీ కాల్చి ఆర్పకుండా పడేస్తుండటంతో మంటలు వ్యాపించి పాలంగట్లు, గుట్టల్లో గ్రాసం పూర్తిగా కాలిపోయి పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది, ఇటీవలి కాలంలో పలుచోట్ల అగ్ని ప్రమాదాల్లో మామిడి, చింత చెట్లు, నిమ్మకాయ చెట్లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.గ్రాసం ధరకు రెక్కలు ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్ట ధర రూ.25 వేలపైగా ధర పలుకుతున్నట్లు పశువుల యజమానులు చెబుతున్నారు. అదికూడా సూదూర ప్రాంతాల్లో ఎక్కడ లభ్యమైతే అక్కడికి వెళ్లి కొనుగోలు చేసి తీసుకురావాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో అదనంగా రవాణా ఖర్చులతో పాటు వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. గ్రాసం కొరత తీవ్రస్థాయిలో నెలకొని పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నా పశుపోష కులను అదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎలాం టి చర్యలు తీసుకోకపోడం బాధాక రమని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీపై గ్రాసం పంపిణీ చేస్తే తమకు ఎంతో ఊరటగా ఉంటుందని రైతులు చెప్తున్నారు.సబ్బిడీపై దాణా పంపిణీ చేసే విషయం పై ప్రభుత్వం నుంచి ఇంతవరకూ మాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పశు బీమా కార్యక్రమం జరు గుతోంది. సబ్సిడీపై పశుగ్రాసం పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఏదైనా సమా చారం అందితే వెంటనే పశువుల యజ మానులకు తెలియ పరుస్తామని అధికారులు చెప్తున్నారు.గ్రాసం లేక ఇబ్బందులు బీడు పాలంలో గొర్రెలను మేపుదామంటే ఎక్కడా గడ్డిపోచ కూడా లేదు. పొద్దన్నే కొద్ది సేపు జీవాలను అట్లా తిప్పుకొనిరావడం, పశు గ్రాసానికి ఎన్నో ఇబ్బం ఎండ పడ గానే చెట్ల కింద నీడన తోలుకోవడం చేస్తున్నా. మేత లేకపోవడంతో గొర్రెలు కాయడం చాలా కష్టమైపోయింది.పసుపు పోషణ భారం అవుతుంది పశుగ్రాసం పెరిగింది పశుపు పోషణ భారం అవుతుంది. వ్యవసాయంలో నష్టాలు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ ఎంచుకున్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు పాడి పశపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. పశువుల పోషణకు నెలకు ఒక ట్రాక్టర్ వరిగడ్డి రూ. 25 వేలు అవుతుంది పశుగ్రాసం విపరీతంగా దాణా, గ్రాసం ధరలు పెరగడం వల్ల పశువుల పోషణ భారం అయిందని అమ్మేశాం. -రాచమల్లు నాగవేణి , బోనాల గ్రామం, లింగాల మండలంరాయితీపై దాణా ఇవ్వాలి పశుగ్రాసం కొందమంటే ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె రూ.25 వేలు పైగా ధర చెబుతున్నారు. గ్రాసం కొని జీవాలు మేపే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం స్పందించి పశుపోషకులకు రాయితీపై దాణా పంపిణీ చేయాలి.- రామచంద్ర, పాడి రైతు ,పులివెందుల
