ప్రజాశక్తి – కడప
కడపలోని వైయస్ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో జరుగుతున్న కల్నల్ సి కె నాయుడు ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. 2 వికెట్ల నష్టానికి 159 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడవరోజు బ్యాటింగ్ ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ తన మొదటి ఇన్నింగ్ లో 124.3 ఓవర్లలో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మిదుల్ పి.సురోచ్ 152 పరుగులు (సెంచరీ) చేశాడు. ఆర్యవట్ శర్మ 75, నారాయన్ 42 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని వాసు 5, శ్రీకర్ 3, కె.ఎస్.రాజు 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 8.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.
