ప్రశాంతంగా ఇంటర్‌, ‘పది’ పరీక్షలు

ప్రజాశక్తి – కడప అర్బన్‌
ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొదటి సంవత్సరం పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు 6,036 మందికిగానూ 5,784 మంది హాజరయ్యారు. 252 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి 479 మందికిగాను 439 మంది హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ అభ్యర్థులు 322 మంది హాజరు కావాల్సి ఉండగా 288 మంది హాజరయ్యారు. 34 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి 91 మంది హాజరు కావాల్సి ఉండగా 81 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం 37 సెంటర్లు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం 20 సెంటర్లు కేటాయించారు. ఎటువంటి డీబార్లు నమోదు కాలేదు. ఆర్‌ఐఒ వెంకటసుబ్బయ్య పులివెందుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్షల తీరును పరిశీలించారు. ఆర్‌జెడి, ఆర్‌ఐఒ, డిఇసి, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ 27 సెంటర్లు తనిఖీ చేశారు. ‘పది’ హిందీ పరీక్షకు 381 మంది హాజరు పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా శనివారం హిందీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 318 మంది హాజరయ్యారు. 16 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్‌ స్వాడ్‌ బృందాలు 8, డిఇఒ అనురాధ ఒక్క సెంటర్‌ తనిఖీ చేశారు.

➡️