ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్గా జోగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

Dec 21,2024 12:18 #Kadapa district

ప్రజాశక్తి-సింహాద్రిపురం : కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల పరిధిలోని హెచ్ ఎల్ సి ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్గా పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు జోగిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. శనివారం అనంతపురంలోనిహెచ్ఎల్సి కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో మండలంలోని కసునూరు డిస్ట్రిబ్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జోగి రెడ్డిని ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈయనను కడప జిల్లాలోని 6 మంది డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, అనంతపురం జిల్లాలోని 5 మంది డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, కర్నూలు జిల్లాలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ లు కలిసి జోగి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జోగి రెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నారు. కాలువలను ఆధునీకరణ చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.

➡️