ప్రజాశక్తి-కడప అర్బన్ : కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్య కళ్యాణ మండపంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ రూపానంద రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు అధికారులు నాయకులు చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా, బొకేలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాధీ చిన్న పరిశ్రమలు శాఖ చైర్మన్ కస్తూరి కోటేశ్వర నాయుడు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రామచంద్రయ్య, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, యస్ సి కార్పొరేషన్ డైరెక్టర్ అనితా దిప్తి, జన సేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, టిడిపి సంస్కృతి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, బిజెపి పార్లమెంటరీ అధ్యక్షులు సాయిలోకేష్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, లాయర్ గుర్రప్ప, చిట్వెల్ మాజీ ఉపాధ్యక్షులు గుండయ్య నాయుడు, సీనియర్ నాయకులు కట్టా బాలాజీ, ఓబులవారిపల్లి మాజీ యం పి పి వెంకటేశ్వర రాజు, తిరుపాల్, సినియర్ నాయకులు పసుపులేటి బ్రహ్మయ్య, రాజుకుంట సర్పంచి గుత్తి నర్సింహులు, మన్నూరు నారాయణ నాయుడు, ముక్కా కుటుంబ సభ్యులు ముక్కా వరలక్ష్మి, ముక్కా సాయివికాస్ రెడ్డి, టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
