కెజిసెట్‌ -2కె24 ఫలితాల విడుదల

ప్రజాశక్తి – కడప అర్బన్‌
వరుసగా 4 సంవత్సరం విజయవంతంగా కెజి సెట్‌ -2కె24 ఫలితాలను కందుల గ్రూప్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.చంద్ర ఓబుల్‌ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్‌ కె.రాజేశ్వరితో కలిసి విడుదల చేశారు. ఈ నెల 1,2,3వ తేదీలలో నిర్వహించిన పరీక్షలకు విశేష స్పందన లభించింది. 3,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చంద్రఓబుల్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన వారికి తమ కళాశాలల్లో ఉచితంగా విద్యతో పాటుగా వసతి కల్పిస్తామని, రెండో ర్యాంకు సాధించిన వారికి వసతి కల్పిస్తామని చెప్పారు. అలాగే మహిళా విద్యార్థినులకు కెఎల్‌ ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి ర్యాంకు వారికి విద్య, వసతి, రెండో ర్యాంకు వారికి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కళాశాల వైస్‌ చైర్మన్‌ కె.మదన్‌ మోహన్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విఎస్‌ఎస్‌ మూర్తి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.నాగేశ్వర ప్రసాద్‌, కె ఎస్‌ ఏం ప్రిన్సిపల్‌ డాక్టర్‌.నాగమణి, కె ఎల్‌ ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.వి.రత్నమ్మ, అడ్మిషన్స్‌ డీన్‌ టి.కిషోర్‌ కుమార్‌, కెఎస్‌ ఆర్‌ ఎం అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పి.ప్రేమ్‌ కుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️