ప్రజాశక్తి -కడప
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజల కోసం పని చేస్తోందని, ఆ దిశగా జిల్లా సమగ్ర అభివద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కషి చేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు మాధవి రెడ్డి, ఆది నారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కష్ణ చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత చరిత్ర చూస్తే 2014-19 లో రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్లు వేసిన ఘనత టిడిపిప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రోడ్లను పట్టించుకోలేదని చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కషి చేయా లన్నారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగ స్వామ్యం కావాలని కోరారు. జిల్లా సమగ్ర అభివద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలో భాగస్వా ములైన కలెక్టర్ నుంచి అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ జిల్లా అభివద్ధిలో భాగస్వాములై. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కషి చేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇరువురూ సమన్వయంతో పనిచేసి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నారు. శాఖల వారీగా జిల్లాలో సాధించిన ప్రగతిని కలెక్టర్ ఇన్‌ఛార్జి మంత్రికి వివరించారు. జిల్లా అభివద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో మొదటి దశ ప్రతిపాదనలతో చేపట్టిన అన్ని రకాల అభివద్ధి పనులను వందశాతం పూర్తి చేశామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా చేపడుతున్న పనులు జిల్లాలో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సాగుతున్నాయన్నారు. రానున్న వేసవిలో చేపట్టే ఉపాధి హామీ పనులను అత్యంత ప్రాధాన్యతగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాన్నారు. మినీ గోకులాల నిర్మాణాలను మార్చిలోపు పూర్చి చేస్తామని చెప్పారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడీసీ మాట్లాడుతూ జిల్లాలో సీజన్ల వారీగా పండిస్తున్న పంటలపై తెగుళ్ల నివారణ, ఎరువుల వాడకం సాగుబడి యాజమాన్యంపై రైతుల్లో పూర్తి స్థాయి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆ దిశగా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని మంత్రికి తెలియజేశారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విస్తారంగా సాగులో ఉన్న ఉద్యాన పంటలైన చీనీ తోటలు ఎండుముఖం పడుతున్నాయని, ప్రభు త్వం వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి దష్టికి తీసుకొచ్చారు. కరువు మండ లాల ప్రకటనలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిరుపయోగంగా, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్న టిడ్కో గహ సముదాయాలను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాల. మంత్రి దష్టికి తీసుకువచ్చారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత ప్రభుత్వంలో ఒంటరి మహిళ లబ్దిదారులుగా నమోదయిన చాలా మంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారని, వారికి కుటుంబ భాగస్వామి ఉన్న కూడా గత ప్రభుత్వ నాయకులు వారిని మభ్యపెడుతూ లబ్దిదారులుగా మార్చారని చెప్పారు. కడప నగరంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా ప్రతిరోజు నీరు అందించేలా, నీటిని వధా కాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. దేవుని కడప రోడ్డు అసంపూర్తిగా ఆగిపోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ రెండరును రద్దు చేయాలని కలెక్టర్ దష్టికి తీసుకొ చ్చారు. సమావేశంలో జెసి అదితి సింగ్, డిఆర్‌ఒ విశ్వేశ్వర నాయుడు, అన్ని రెవె న్యూ డివిజన్ల ఆర్‌డిఒలు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
