సిఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయండి 

Jan 16,2025 13:51 #Kadapa district

  జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
ప్రజాశక్తి – కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18న  మైదుకూరులో పర్యటించే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారికంగా మినిట్ టు మినిట్ అందాల్సి ఉంది.  ఈ సందర్భంగా అధికారులందరు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని.. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా… గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ ఎస్ హాలులో ముందస్తు ఏర్పాట్లపై జేసీ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి  జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు.  ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు.. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు. హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను  ఆదేశించారు. హెలిప్యాడ్, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లను ఆర్ అండ్ బి అధికారులు పటిష్టంగా చేపట్టాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీడిసిఎల్ ఎస్ఈ రమణ ను ఆదేశించారు.  ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను పూర్తిచేసి విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో  జడ్పి సీఈవో ఓబులమ్మ,  కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీఓ లు జాన్ ఇర్వీన్, సాయిశ్రీ, చంద్రమోహన్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇంచార్జి సీపీవో హజ్రతయ్య, డిఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడిలు ఆనంద్ నాయక్, ఆది శేషా రెడ్డి, శ్రీలక్ష్మి,  డిఎం అండ్ హెచ్ ఓ డా. కె. నాగరాజు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, స్టెప్ సీఈవో సాయి గ్రెస్,   డిపివో రాజ్యలక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ ఈ చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం ప్రసాద్ రెడ్డి, తదితర అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️