కెెఎస్‌ఆర్‌ఎం, ‘సర్వీస్‌ నౌ’ మధ్య కుదిరిన ఎంఒయు

ప్రజాశక్తి – కడప అర్బన్‌
బిటెక్‌ 3వ సంవ త్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు సర్వీస్‌ నౌ వారిచే సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ అంది ంచేందుకు ఎంఒయు కుదుర్చు కున్నారు. సోమవారం అవగాహన సదస్సు నిర్వహి ంచారు. సర్వీస్‌ నౌ డైరెక్టర్‌ జి.భాస్కర్‌ మాట్లాడుతూ సర్వీస్‌ నౌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ కోర్సెస్‌ చేయడం వల్ల విద్యార్థిని, విద్యార్థులకు అధునాతన సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రముఖ కంపెనీలలో ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఏపీ లోని ప్రయివేట్‌ అటానమస్‌ కళాశాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమం మొదటిదని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ కె.రాజేశ్వరి,వైస్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి,మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.ఎస్‌.ఎస్‌. మూర్తి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.నాగేశ్వర ప్రసాద్‌, సీనియర్‌ టి పి ఓ ఆర్‌.నాగరాజు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పి.ప్రేమ్‌ కుమార్‌, విద్యార్థి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️