మున్సిపల్ ఫెడరేషన్ సంక్రాంతి సంబరాలు

Jan 13,2025 13:05 #Kadapa district

ప్రజాశక్తి-కడప అర్బన్ : నగరపాలక సంస్థలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు సోమవారం పాత మున్సిపల్ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్మికులు భోగి మంటలు వేసి సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ చంద్రశేఖర్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు విధులే కాకుండా పండుగ సందర్భంగా ఆటలు పాటలు ఉండాలని చెప్పారు. ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ మాట్లాడుతూ భోగి పండుగ పర్యావరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా కార్మికులచే నిర్వహించామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కార్మికుల్లో నూతన ఉత్తేజం, సమాన భావన కలుగుతుందని తెలిపారు. నగర కమిటీ అధ్యక్షులు రవి మాట్లాడుతూ మున్సిపల్ యూనియన్ అంటే ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆందోళనలు కాదని చెప్పారు. ఇటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమనికి సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులకు, కార్మికులకు ముఖ్య నాయకత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సుంకర కిరణ్, దాసు, పెంచలయ్య, వడ్లపల్లి శ్రీధర్ బాబు, ఇత్తడి ప్రకాష్ ,ఆసిబాబు, ధరణి, ఉమా, నాగరాజు, శ్రీరాము, ఓబులేసు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

➡️