ప్రజాశక్తి – కడప : క్రమశిక్షణకు, చక్కటి శరీర సౌష్టవానికి ఎన్.సి.సి డ్రిల్ ఉపయోగపడుతుందని ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి అన్నారు. తెలుగు గంగా కాలనీలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా గురువారం ఎన్.సి.సి క్యాడెట్లకు రైఫిల్ డ్రిల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కల్నల్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ పౌరులుగా మెలగడానికి అవసరమైన అన్ని లక్షణాలను క్యాడెట్లు ఈ క్యాంపులో నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ గ్రూప్ కెప్టెన్ ఆర్.జే. ఆత్రే, ఎన్.సి.సి అధికారులు కెప్టెన్. డాక్టర్. నీలయ్య, శివరాం, పసుపుల రాజశేఖర్, జగదీష్, సురేంద్ర నాయక్ పరేడ్ శిక్షణ అధికారులు సుబేదార్ మేజర్ అనిల్ కుమార్, రూపేంద్ర జిత్ సింగ్, సీ.ఎల్. రెడ్డి, కొండా రెడ్డి , గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ మిశ్రా ఆఫీస్ సిబ్బంది సూపరిండెంట్ డేవిడ్, ఉమా, మల్లేశ్వరి, శివప్రసాద్, రాజగోపాల్ రెడ్డి, ఎన్.సి.సి సీనియర్ క్యాడెట్లు మల్లికార్జున్, ఆనంది పాల్గొన్నారు.
