చలివేంద్రం ప్రారంభించిన ఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు

Apr 13,2025 12:53 #Kadapa district

ప్రజాశక్తి-కడప అర్బన్ : జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎన్జీవో జిల్లా అధ్యక్షులు బి.శ్రీ నివాసులు ప్రారంభించారు. ఆదివారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్ దగ్గర ఉన్న జనతా మెడికల్ స్టోర్స్ ఎదురుగా నూతనంగా చలివేంద్రాన్ని జమాతే ఇస్లామి హింద్ సంఘ సేవ విభాగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం ప్రజలు రద్దీగా ఉన్న చోట చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. జమాతే ఇస్లామి హింద్ కడప శాఖ 15 సంవత్సరాల నుంచి ఇటువంటి గొప్ప పుణ్య కార్యక్రమం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీ జిఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి.రవికుమార్, జమాతే ఇస్లామీ హింద్ కడప శాఖ అధ్యక్షుడు ఎస్.ఖాదర్ వలీ, సంస్థ సభ్యులు రియాజ్ బాష, జాకీర్ హుస్సేన్, అబ్దుల్లా, అబ్దుల్ రహీం, మాబాష, మహబూబ్ బాషా పాల్గొన్నారు.

➡️