ప్రజాశక్తి- కడప అర్బన్
న్యాక్ ఏ ప్లస్ గ్రేడు లక్ష్యంగా విశ్వవిద్యాలయం పయనిస్తోందని, అందులో భాగంగా దూరవిద్యలో పటిష్టం చేస్తున్నామని యోగివేమన విశ్వవిద్యాలయ విసి ఆచార్య కె. కష్ణారెడ్డి ఉద్ఘాటించారు. వైవీయూలోని అన్నమాచార్య సేనెట్ హాల్లో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, విశ్వవిద్యాలయ విసి ఆచార్య కె. కష్ణారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా 8 కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఎంబిఎ( జనరల్ ), ఎంబీఏ ( హెచ్‌ఆర్‌ఎం) కోర్సులు తీసుకురానున్నామని ప్రకటించారు. వైవీయూకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడు రాగానే డిగ్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు గల కోర్సులు తీసుకురావాలని కోరుతున్నారని, అందుకు తగ్గ కర్యిక్యు లమ్ ఆచార్యులు రూపొందిస్తే తాము తేవడానికి సిద్ధమన్నారు. వైవీయూ దూరవిద్య గురించి అందరూ విస్తత ప్రచారం కల్పించాలని, ఉన్నత విద్యను అందరూ అభ్యశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో కూడా పెరిగేందుకు కషిచేద్దామని ఆకాంక్షించారు. 3,4 సెమిస్టర్ల మెటీరియల్‌ను సకాలంలో రూపొందించాలని సూచించారు. దూరవిద్యను సులభతరం చేస్తూ సకాలంలో కోర్సు పూర్తిచేసి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి మాట్లాడుతూ చదువులపట్ల ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ ఉన్నత విద్యను అభ్యశించాలనే లక్ష్యంగా వైవీయూ దూరవిద్యను డోర్ స్టెప్‌నకు తీసుకువెళుతోందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ ప్రస్తుత యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ సూచించినట్లు దూరవిద్య, రెగ్యులర్ విద్య రెండూ సమానమేనన్నారు. అలానే ఒక కోర్సు రెగ్యులర్‌గా మరొక కోర్సు దూరవిద్యలో అభ్యసించే అవకాశం ఉందన్నారు. ప్రతి విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ రెండు కోర్సులు చదువుకుని విస్తత అవకాశాలు అందుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు దూరవిద్య సిలబస్ ఉపయుక్తమవుతుందన్నారు. దూరవిద్య ఉప సంచాలకులు డాక్టర్ ఎం. శ్రీధర్ బాబు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ హుమానిటీస్ డీన్ ఆచార్య కె.గంగయ్య, ఆచార్యులు బాయినేని శ్రీనివాసులు, ఎన్.ఈశ్వరరెడ్డి, టి. రామప్రసాద్ రెడ్డి, విజయభారతి, అనిత, గంజి పార్వతి, జి. పార్వతి, మెర్సీ విజేత, వినోదిని, అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రమీళామార్గరేట్, జయంత్ కశ్యప్, సతీష్ బాబు, లలిత, సుదర్శనరెడ్డి, అంకన్న, హరనాథ్, పలు కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు హాజరై విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు, పుస్తకాల రచయితలు పాల్గొన్నారు.
