– డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం
ప్రజాశక్తి-కడప సిటీ
కార్పొరేషన్‌ పరిధిలోని 18వ డివిజన్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కడప కార్పొరేషన్‌ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి జి. మోహన్‌ బాబు, సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌ పొన్నోలు సుబ్బిరెడ్డి, సిపిఐ నాయకులు వేణుగోపాల్‌, కెసి బాదుల్లా మాట్లాడుతూ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానంద రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ డివిజన్‌లోని సాయి ప్రతాప్‌ నగర్‌, జె.వి. నగర్‌, ఎస్‌.ఆర్‌. నగర్‌, స్వామి నగర్‌ ప్రాంతాలలో దాహం కేకలు మిన్నంటుతున్నాయన్నారు. అయినప్పటికీ డిప్యూటీ మేయర్‌ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. పదేళ్ల నుంచి కడప కార్పొరేషన్‌ పాలకమండలి వైసిపి చేతుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదన్నారు.. సాయి ప్రతాప్‌ నగర్‌ కాలనీ ఏర్పడి 25 ఏళ్లు అయిందని, ఇక్కడ 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఇక్కడికి మంచినీటి సరఫరా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని స్వామి నగర్‌లోని బోరుబావి నుంచి సరఫరా అవుతుందన్నారు. మంచినీటి పైపులైనుకు లీకేజీలు ఉన్నాయన్నారు. దీంతో సాయిప్రతాప్‌నగర్‌కు సక్రమంగా నీరు చేరడం లేదని వాపోయారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌కు రాకేష్‌ చంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ సాయి ప్రతాప్‌ నగర్‌ నీటి సమస్యను కమిషనర్‌ దష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకు ంటామని మామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాయి ప్రతాప్‌ నగర్‌ డెవలప్మెంట్‌ కమిటీ నాయకులు ఎం అక్బర్‌ బాషా, చంద్రారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్‌ రెడ్డి, సిరాజ్‌బాష, వసంతరెడ్డి, రహమాన్‌, నరసింహులు, చెన్నకేశవులు, సాయి ప్రతాప్‌ నగర్‌ ప్రజలు పాల్గొన్నారు.

➡️