క్యూఆర్ కోడ్ తో సులభతరంగా బిల్లుల చెల్లింపు 

Feb 2,2025 16:46 #Kadapa district

– జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్.రమణ
ప్రజాశక్తి – కడప : క్యూఆర్ కోడ్ ద్వారా సులభతరంగా మరియు సమర్థవంతంగా విద్యుత్ బిల్లులు చెల్లించా వచ్చిందని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్.రమణ అన్నారు. ఆదివారం విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ బిల్లులు చెల్లించుటకై వినియోగదారులు వ్యయ ప్రయాసలకు  గురికాకుండా సులభతరంగా, సమర్థవంతంగా క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించుట గురించి జిల్లా విద్యుత్ శాఖ అధికారి సుపరింటెండింగ్ ఇంజనీర్ యస్.రమణ కడపలోని నెహ్రు నగర్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విద్యుత్ బిల్లులు సులభతరంగా మరియు సమర్థవంతంగా చెల్లించే విధానము గురించి విద్యుత్ వినియోగదారులకు వివరించారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి డిమాండ్ నోటీసు కింద భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది అని తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ ని ఫోన్ పే ద్వారా గాని గూగుల్ పే ద్వారా గాని పేటియం ద్వారా గాని ఏదైనా ఇతర పేమెంట్ యాప్ల ద్వారా గాని స్కాన్ చేసిన వెంటనే బిల్లుకు సంబంధించి అమౌంటు మరియు సంబంధిత 13 అంకెల విద్యుత్ సర్వీస్ నెంబరు యాప్ లో కనిపిస్తుంది అన్నారు. దీనిని నిర్ధారణ చేసుకొని తదుపరి పద్ధతి ద్వారా చెల్లింపు అత్యంత సులభతరంగా మరియు సమర్థవంతంగా చేయవచ్చని ప్రజలకు తెలియజేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించుటకు క్యూ లైన్ లో నిలబడకుండా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, అనధికార వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మోసపోకుండా, సమర్థవంతమైన క్యూఆర్ కోడ్ పద్ధతిని ఉపయోగించి సమర్థవంతంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తదుపరి కడప నెహ్రు నగర్ లోని క్షేత్రస్థాయిలో క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపుల పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పర్యటించి వారితో క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయించారు. ఈ క్యూఆర్ కోడ్ ప్రతినెల మారుతూ ఉంటుంది.  ఒకసారి విద్యుత్ బిల్లుకు సంబంధించిన డిమాండ్ నోటీసు ఇచ్చిన తర్వాత మరల మరొక డిమాండ్ నోటీసు ఇవ్వడం సాధ్యం కాదని తెలియజేస్తూ విద్యుత్ బిల్లును భద్రపరచుకోవడమో లేదా విద్యుత్ బిల్లును ఇచ్చిన వెంటనే చెల్లింపులు చేయడము సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమము లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

➡️